డీజీపీ ఠాకూర్ పై వైసీపీ సంచలన ఆరోపణ

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలుగుదేశం పార్టీ తొత్తులా, కార్యకర్తలా పనిచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని [more]

Update: 2019-03-28 07:55 GMT

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలుగుదేశం పార్టీ తొత్తులా, కార్యకర్తలా పనిచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ నెల 24వ తేదీన డీజీపీ ఆర్పీ ఠాకూర్ తన కాన్వాయ్ లోనే అమరావతి నుంచి ప్రకాశం జిల్లాకు రూ.35 కోట్లు తరలించారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్న ఆర్పీ ఠాకూర్ ను వెంటనే బదిలీ చేస్తేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయన్నారు. ఇప్పటికే సీబీఐ, ఇన్ కం ట్యాక్స్ ను రాష్ట్రంలోకి అనుమతించమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘాన్నే బేఖాతరు చేస్తున్నారని ఆరోపించారు. అధికారం కోసం చంద్రబాబు ఎంత నీచానికి అయినా పాల్పడతారన్నారు. భారతదేశంలో ఏపీ ఒక భాగం అనే విషయాన్ని కూడా చంద్రబాబు మరిచిపోయారన్నారు. చంద్రబాబుకు అమ్ముడుపోయి వైసీపీ అభ్యర్థుల ఓట్లు చీల్చేందుకు కేఏ పాల్ పనిచేస్తున్నారని అన్నారు. ప్రజాశాంతి పార్టీ గుర్తు, జెండా మార్చాలని ఈసీని కోరినట్లు తెలిపారు.

Tags:    

Similar News