బాబు ఇల్లు ఖాళీ చేయాల్సిందే

కరకట్టమీద ఆక్రమణలను తొలిగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. కరకట్టలపై అక్రమనిర్మాణలపై శాసనసభలో చర్చ సందర్భంగా జగన్ స్పందించారు. కరకట్టల మీద నిర్మాణాలు పెరిగిపోతే భవిష్యత్తులో విజయవాడ [more]

Update: 2019-07-18 04:44 GMT

కరకట్టమీద ఆక్రమణలను తొలిగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. కరకట్టలపై అక్రమనిర్మాణలపై శాసనసభలో చర్చ సందర్భంగా జగన్ స్పందించారు. కరకట్టల మీద నిర్మాణాలు పెరిగిపోతే భవిష్యత్తులో విజయవాడ మునిగిపోతుందన్నారు. నీరు వెళ్లే మార్గానికి అడ్డుకట్ట వేస్తే ఎలా అని జగన్ నిలదీశారు. చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతో కరకట్టలపై నిర్మాణాలను కూల్చివేయడం లేదన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణంలో నివాసముంటే ఎలా అని ప్రశ్నించారు జగన్. నిబంధన అనేది ముఖ్యమంత్రి నుంచి సామాన్యుడి వరకూ ఒకటే ఉండాలన్నారు. చంద్రబాబు తన ఇంటిని నిబంధనలకు లోబడి ఖాళీ చేయలన్నారు. చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ జీవితం ఏం నేర్పిందన్నారు. అందరికీ రోల్ మోడల్ గా ఉండాల్సిన చంద్రబాబు నిబంధలను అతిక్రమిస్తే ఎలా అని జగన్ ప్రశ్నించారు. అందుకే తొలుత ప్రజావేదికను కూల్చామని జగన్ స్పష్టం చేశారు. ఇప్పటికే 30 మంది యజమానులకు నోటీసులు ఇచ్చామన్నారు. ఖాళీ చేయకుంటే కూల్చి వేస్తామని చెప్పామన్నారు జగన్

Tags:    

Similar News