పేదవాడి తలరాత మార్చేందుకు 8 పథకాలు

అంగన్ వాడీ కేంద్రాలను ఇకపై ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా మార్చబోతున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఆరేళ్లు రాకమునుపే పిల్లల మెదళ్లు 85 శాతం [more]

Update: 2020-10-08 07:26 GMT

అంగన్ వాడీ కేంద్రాలను ఇకపై ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా మార్చబోతున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఆరేళ్లు రాకమునుపే పిల్లల మెదళ్లు 85 శాతం అభివృద్ధి చెందుతాయి. అందుకే ప్రీప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పునాది పాడులో జగనన్న విద్యాకానుక పథకాన్ని జగన్ ప్రారంభించారు. వచ్చే జనవరి 9వ తేదీన మరోసారి అమ్మవొడి పథకం కింద తల్లులకు పదిహేను వేలు అందిస్తామని జగన్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను అమలు పరుస్తామని చెప్పారు. పేద విద్యార్థి ఉన్నత చదువు చదువుకునేంత వరకూ తాను అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. ప్రతి పేద విద్యార్థి గొప్ప చదువులు చదువుకునేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రపంచం మన దగ్గరకు రావాలని జగన్ ఆకాంక్షించారు. పేదవాడి తలరాతలను మార్చేందుకు ఎనిమిది ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నట్లు జగన్ తెలిపారు. నవంబరు 2వ తేదీ పాఠశాలలు ప్రారంభమయ్యే లోగా కిట్లను విద్యార్థులకు అందించనున్నామని చెప్పారు. దాదాపు ఆరునెలల అనంతరం బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.

Tags:    

Similar News