బ్రేకింగ్ : మృతుల కుటుంబాలకు జగన్ భారీ ఎక్స్ గ్రేషియో

విశాఖ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ అయి మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియోను ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు [more]

Update: 2020-05-07 09:30 GMT

విశాఖ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ అయి మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియోను ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు చెల్లించనున్నట్లు జగన్ ప్రకటించారు. ప్రాధమిక చికత్స చేయించుకున్న వారికి ఇరవై అయిదువేలు, ఆసుపత్రిలో రెండు, మూడు రోజులు ఉండి చికిత్స చేయించుకున్న వారికి లక్ష రూపాయల చొప్పున పరిహారాన్ని చెల్లిస్తామని జగన్ ప్రకటించారు. కేజీహెచ్ లో బాధితులను పరామర్శించిన తర్వాత జగన్ ఈ సంఘటన పై అధికారులతో సమీక్షించారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వారికి పది లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పారు. విశాఖ ఘటనలో 9 మంది చనిపోయారన్నారు. ఈ సంఘటనపై విచారణ చేయించేందుకు జగన్ కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగానే కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు. నివేదిక ప్రకారమే కంపెనీని అక్కడి నుంచి తరలించాలా? వద్దా? అన్నది నిర్ణయిస్తామని జగన్ చెప్పారు. అధికారులు సకాలంలో స్పందించబట్టే ప్రాణనష్టం తగ్గించగలిగారని అధికారులను జగన్ ప్రశంసించారు. గ్యాస్ లీక్ అయినప్పుడు కనీసం సైరన్ మోగకపోవడాన్ని జగన్ తప్పు పట్టారు.

Tags:    

Similar News