రాజధానిపై జగన్ పెదవి విప్పేదెప్పుడంటే?

రాజధాని అమరావతి నిర్మాణంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. రాజధాని నిర్మాణంపై నిపుణుల కమిటీని మాత్రం నియమించారు. ఆ నిపుణుల [more]

Update: 2019-11-10 02:41 GMT

రాజధాని అమరావతి నిర్మాణంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. రాజధాని నిర్మాణంపై నిపుణుల కమిటీని మాత్రం నియమించారు. ఆ నిపుణుల కమిటీ ఇటీవల నివేదికను కూడా జగన్ ప్రభుత్వానికి సమర్పించింది. దీంతోపాటు నిపుణుల కమిటీ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పర్యటించి అక్కడి ప్రజల అభిప్రాయాలను సేకరించి, ఆప్రాంతంలో నెలకొన్న సమస్యలను కూడా తెలుసుకోనుంది.

శీతాకాల సమావేశాల్లో…..

మరోవైపు రాజధాని అమరావతిపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. నిపుణుల కమిటీ సూచనల మేరకే రాజధాని నిర్మాణం జరుగుతుందని బొత్స ఇటీవల కూడా స్పష్టం చేశారు. రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి వరకూ మాట్లాడలేదు. అయితే త్వరలో జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జగన్ రాజధాని అంశంపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. డిసెంబరు నెలలో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లోనే రాజధాని అమరావతి అంశంపై స్పష‌్టత రానుంది.

Tags:    

Similar News