తాత్కాలికమే… భయపడాల్సిన పనిలేదు

ఇసుక కొరతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. వరదల వల్ల ఇసుకను బయటకు తీయలేకపోతున్నామన్నారు. 265 రీచ్ లుంటే అందులో కేవలం 61 రీచుల్లో మాత్రమే [more]

Update: 2019-11-04 08:01 GMT

ఇసుక కొరతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. వరదల వల్ల ఇసుకను బయటకు తీయలేకపోతున్నామన్నారు. 265 రీచ్ లుంటే అందులో కేవలం 61 రీచుల్లో మాత్రమే ఇసుక అందుబాటులో ఉందని జగన్ అన్నారు. మిగిలిన రీచులన్నీ వరద నీటిలో ఉన్నాయన్నారు. కృష్ణా, గోదావరి, పెన్నా నదులు 90 రోజులుగా వరదతో నిండిపోయి ఉన్నాయన్నారు. ఇసుక సమస్య తాత్కాలికమైనదని, దీనికి భయపడాల్సిన పనిలేదని జగన్ అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం ఇసుక మాఫియాను నడిపిందన్నారు. అడ్డగోలుగా దోచుకుందన్నారు. తమ ప్రభుత్వం కొత్త ఇసుకపాలసీ ద్వారా పారదర్శకంగా తక్కువ ధరతో ఇసుక పంపిణీ చేస్తుందన్నారు. నవంబరు నెలాఖరుకు ఇసుక సమస్య తీరుతుందని జగన్ చెప్పారు. రోడ్లు భవనాల శాఖ సమీక్ష సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News