బ్రేకింగ్ : కుర్రాడు అదరగొట్టాడుగా..!

Update: 2018-10-04 07:34 GMT

టీమిండియాకు మరో మంచి క్రికెటర్ దొరికాడు. రాజ్ కోట్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత యువత ఆటగాడు పృధ్వీ షా అదరగొట్టాడు. ముంబాయికు చెందిన పృధ్వీ షా కు ఇది మొదటి అంతర్జాతీయ మ్యాచ్. తొలి టెస్టులోనే మెరుపులు మెరిపించిన పృధ్వీ... 99 బంతుల్లో 15 ఫోర్లతో 101 పరుగులు సాధించి అద్భుతమైన ఆటతీరు కనబర్చాడు. పృధ్వీ వయస్సు కేవలం 18 ఏళ్లు మాత్రమే కావడం గమనార్హం. మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ లోనే సెంచరీ చేసిన 5వ బ్యాట్స్ మెన్ గా పృధ్వీ రికార్డు క్రియేట్ చేశాడు. ఎక్కడా కొత్త ఆటగాడిలా కాకుండా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఆడాడు. ఇక పృధ్వీ ఇంతకుముందు ముంబాయిలో స్కూల్ క్రికెట్ మ్యాచ్ లో 14 ఏళ్ల వయస్సులోనే 546 పరుగులు చేసి ఆశ్చర్యపరిచుడు. అంతేకాదు, భారత్ కు అండర్ - 19 క్రికెట్ వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్ గా కూడా రికార్డు క్రియేట్ చేశాడు. మొత్తానికి పృధ్వీ షా భవిష్యత్ లో మేటి క్రికెటర్ గా ఎదుగుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు.

Similar News