ఎమ్మెల్యేగా కూడా గెలవలేని దద్దమ్మ

మాజీ మంత్రి నారా లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైరయ్యారు. ఎమ్మెల్యే కూడా గెలవలేని లోకేష్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమేంటని రోజా ప్రశ్నించారు. తిన్నది అరగక, [more]

Update: 2020-06-28 04:26 GMT

మాజీ మంత్రి నారా లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైరయ్యారు. ఎమ్మెల్యే కూడా గెలవలేని లోకేష్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమేంటని రోజా ప్రశ్నించారు. తిన్నది అరగక, పనిపాట లేకుండా లోకేష్ విమర్శలు చేస్తున్నారన్నారు. తిరుమలను శ్రీవారిని దర్శించుకున్న రోజా మీడియా తో మాట్లాడారు. కరోనా సమయంలో తండ్రి, కొడుకులు పక్క రాష్ట్రంలో దాక్కున్నారని, ఇప్పుడు పరామర్శ పేరుతో బయటకు వచ్చారని రోజా విమర్శించారు. అవినీతికి పాల్పడిన నేతలనే ప్రభుత్వం అరెస్ట్ లు చేస్తుందని రోజా తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీ లన్నింటిని అమలు చేస్తున్న జగన్ ను విమర్శించే స్థాయి లోకేష్ లేదన్నారు రోజా.

Tags:    

Similar News