జమిలి ఎన్నికలపై నిర్ణయం చెప్పేసిన వైసీపీ

Update: 2018-07-10 09:45 GMT

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ విధానాన్ని స్పష్టం చేసింది. మంగళవారం వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కేంద్ర లా కమిషన్ ను కలిసి జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు తమకు అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ...కేవలం ఒక్కసారి మినహా ఎప్పుడైనా కేంద్రంతో సహా ఆంధ్రప్రదేశ్ కి ఎన్నికలు జరుగుతున్నాయని, కాబట్టి, జమిలి ఎన్నికలకు తమ పార్టీకి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. జమిలి ఎన్నికల ద్వారా ఖర్చు తగ్గుతుంది, అవినీతి తగ్గుతుందని, ఓటుకు నోటు కేసు వంటివి రావని ఆయన పేర్కొన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణ దేశానికి మేలు చేసేదే అని, కానీ, ఇందులో ఉన్న కొన్ని సమస్యలను లా కమిషన్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరిస్తే జమిలి ఎన్నికల ద్వారా దేశానికి మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

Similar News