22 వేల కోట్ల నిధులు మళ్లింపు.. ఇరవై మంది అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ కేసులో చార్జిషీట్ ను సిసిఎస్ సైబర్ క్రైమ్స్ పోలీసులు సిద్ధం చేశారు. ..ఇప్పటివరకు ఇరవై మందిని అరెస్ట్ [more]

Update: 2021-03-25 00:50 GMT

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇన్ స్టెంట్ లోన్ యాప్స్ కేసులో చార్జిషీట్ ను సిసిఎస్ సైబర్ క్రైమ్స్ పోలీసులు సిద్ధం చేశారు. ..ఇప్పటివరకు ఇరవై మందిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ లో ఆరుగురు , హైదరాబాద్ లో ఆరుగురు, బెంగుళూరు లో ఏడుగురు , కర్నూల్ లో ఒకరిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఈకేసులో మొత్తం 22 వేల కోట్ల నిధుల మళ్ళింపు జరిగిందని అధికారులు వెల్లడించారు. 197మొబైల్ యాప్స్ ద్వారా లక్షలాది మందికి అత్యధిక వడ్డీ తో పదివేల లోపు రుణాలు ఇచ్చారు. దేశంలోని పలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల( ఎన్ బి ఎఫ్ సీ ) ను యథేచ్ఛగా వాడుకున్న ముఠా ప్రధాన నిర్వాహకుడు చైనా దేశీయుడు లాంబో గా గుర్తించారు. బెంగుళూరు కేంద్రంగా పిన్ పింగ్ టెక్నాలజీస్ , ల్యూఫాన్గ్ టెక్నాలజీస్, నా బ్లూమ్ టెక్నాలజీస్ , హార్ట్ ఫుల్ టెక్నాలజీస్ పేరుతో నాలుగు సంస్థలు ఏర్పాటు చేసి లోన్ ఇచ్చారు.తర్వాత వేగంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. బిటెక్ విద్యార్థులను ఉద్యోగులుగా చేర్చుకుని వారిని వారి సంతకాలు తీస్కొని వారిపేరుపై రుణాలు మంజూరు చేసింది.

Tags:    

Similar News