ఏపీకి నిధులు బాగానే వచ్చాయి… ప్రభుత్వం అసత్యాలు?

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి గత ఆర్థిక సంవత్సరం భారీగా నిధులు వచ్చాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. లాక్ డౌన్ వల్ల ఏపీ [more]

Update: 2020-04-19 06:54 GMT

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి గత ఆర్థిక సంవత్సరం భారీగా నిధులు వచ్చాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. లాక్ డౌన్ వల్ల ఏపీ నష్టపోయింది 1400 కోట్లు మాత్రమేనని అన్నారు. ప్రభుత్వం మాత్రం 13 వేల కోట్లు నష్టపోయామని చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీలోని 11 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్ లుగా ప్రకటిస్తే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 97 మండలాలే రెడ్ జోన్లు అని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. గత 6 సంవత్సరాల నుంచి రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, గత ఏడాది కేంద్రం నుంచి నిధులు బాగానే వచ్చాయన్నారు. రద్దు చేసిన పాత పథకాలకు కూడా నిధులు వచ్చాయని యనమల రామకృష్ణుడు తెలిపారు.

Tags:    

Similar News