ఫ్రోర్బ్స్ జాబితాలో విరాట్... ఆదాయం ఎంతో తెలుసా..?

Update: 2018-06-06 08:49 GMT

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆయన సొంతం. గ్రౌండ్ లో పరుగులవరద పారిస్తూ దూసుకుపోయే విరాట్ ఇప్పుడు ఆదాయంలో అంతే స్పీడ్ గా వెళుతున్నాడు. తాజాగా ఫోర్బ్స్ ప్రకటించిన అత్యధిక ఆదాయం కలిగిన టాప్-100 అథ్లెట్ల జాబితాలో విరాట్ స్థానం సంపాదించాడు. భారత్ నుంచి ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక క్రీడాకారుడు విరాట్ కోహ్లీ. మొత్తం 24 మిలియన్ డాలర్ల ఆదాయంతో కోహ్లీ ఈ జాబితాలో 83వ స్థానంలో నిలిచాడు. ఇందులో 4 మిలియన్ డాలర్లు జీతం ద్వారా, మరో 20 మిలియన్ డాలర్లు వాణిజ్య ఒప్పందాల ద్వారా సంపాదించాడు. ప్రస్తుతం కోహ్లీ బీసీసీఐ నుంచి ఏ-ప్లస్ కేటగిరీ కాంట్రాక్టులో ఉన్నాడు. గత ఏడాది కూడా 22 మిలియన్ డాలర్లతో 89వ స్థానంలో నిలిచిన కోహ్లీ ఈ ఏడాది ఆరుస్థానాలు మెరుగుపరుచుకున్నాడు.

ఎక్కువగా అమెరికన్లే...

గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ 1 వరకు సంవత్సర కాలంలో ఆటగాళ్లు పొందిన ఆదాయాన్ని లెక్కించి ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. మొత్తం 100 మంది టాప్ క్రీడాకారుల్లో అమెరికాకు చెందిన వారే 66 మంది ఈ జాబితాలో ఉన్నారు. ఆ దేశానికే చెందిన టాప్ బాక్సర్ మేవెడర్ 285 మిలియన్ డాలర్లతో మొదటిస్థానంలో నిలిచాడు. అర్జెంటీనా కు చెందిన ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీ 111 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, పోర్చుగల్ ఫుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డొ 108 మిలియన్ డాలర్ల ఆదాయంతో మూడో స్థానంలో నిలిచారు.

Similar News