బాబు.. ఏది అరాచకత్వం..?

కాంగ్రెస్, చంద్రబాబు కుమ్మక్కై కేసులు పెట్టి 16 నెలలు జైల్లో ఉంటేనే తన కొడుకు జగన్ బయపడలేదని, ఇప్పుడు అసలే బయపడరని వైసీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పేర్కొన్నారు. [more]

Update: 2019-04-09 12:06 GMT

కాంగ్రెస్, చంద్రబాబు కుమ్మక్కై కేసులు పెట్టి 16 నెలలు జైల్లో ఉంటేనే తన కొడుకు జగన్ బయపడలేదని, ఇప్పుడు అసలే బయపడరని వైసీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పేర్కొన్నారు. మంగళవారం ఆమె ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చివరి ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ… చంద్రబాబు బీజేపీతో ఉన్నప్పుడు జగన్ కాంగ్రెస్ తో ఉన్నారని తప్పుడు ప్రచారం చేశారని… ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ తో ఉండి జగన్ బీజేపీతో ఉన్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జగన్ ఎవరికీ బయపడే వారు కాదని, 25 మంది ఎంపీలను గెలుచుకొని ప్రత్యేక హోదా సాధించడమే జగన్ లక్ష్యమన్నారు. జగన్ వస్తే అరాచకం చేస్తారని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని… జగన్ ఓదార్పు యాత్ర చేయడం అరాచకమా ? పార్టీ ఫిరాయింపుల చట్టానికి లోబడి విలువలతో కూడిన రాజకీయం చేయడం అరాచకత్వమా..? 31 కేసులు మీరే పెట్టినా ఎదుర్కొని, 16 నెలలు మీరే జైల్లో పెట్టినా చట్టప్రకారం ఎదుర్కొన్నది అరాచకత్వమా..? అని ప్రశ్నించారు.

ఏది అరాచకత్వం

వైజాగ్ ఎయిర్ పోర్టులో మీరే చంపించేందుకు ప్రయత్నిస్తే హుందాగా చొక్కా మార్చుకొని అందరూ సంయమనం పాటించాలని చెప్పిన జగన్ ది అరాచకత్వమా.? అమలు చేయలేని హామీలు ఇవ్వకపోవడం అరాచకమా..? ప్రత్యేక హోదా కోసం పోరాడటం అరాచకత్వమా..? ప్రజల తరపున పోరాడటం అరాచకత్వమా..? పాదయాత్ర చేసి లక్షల మందిని కలవడం అరాచకమా..? రాజన్న రాజ్యం తెస్తానని, నవరత్నాలతో ప్రజల జీవితాల్లో మార్పు తెస్తానని చెప్పడం అరాచకత్వమా..? అని చంద్రబాబును ప్రశ్నించారు. జగన్ కు, రాజశేఖర్ రెడ్డికి ప్రేమించడమే తెలుసని రౌడీయిజం తెలియదని పేర్కొన్నారు. చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని, విజ్ఞతతో ఆలోచించి జగన్ కు ఓటేసి గెలిపించాలని కోరారు.

Tags:    

Similar News