18 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

వైజాగ్ కేంద్రంగా నడిచిన హవాలా వ్యాపారి వడ్డీ మహేష్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 18 కోట్ల పైచిలుకు ఆస్తులను అటాచ్ చేస్తూ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. [more]

Update: 2021-08-18 01:58 GMT

వైజాగ్ కేంద్రంగా నడిచిన హవాలా వ్యాపారి వడ్డీ మహేష్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 18 కోట్ల పైచిలుకు ఆస్తులను అటాచ్ చేస్తూ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు 1600 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు . విశాఖపట్నం పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ జరిపింది. ఇందులో 40 షెల్ కంపెనీలను గుర్తించింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేసి ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో 18 కోట్ల రూపాయల మేరకు ఆస్తులను అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పెద్దమొత్తంలో నిధులను హవాలా ద్వారా విదేశాలకు పంపినట్లుగా ఈడీ గుర్తించింది. నలభై కంపెనీల ద్వారా ఈ నిధులను బదలీ చేసినట్టుగా ఈడీ చెప్పింది. కాకా గ్రూప్ , శశి గోయల్, ప్రగతి ప్రింట్ ప్యాక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులను జప్తు చేసింది . దీంతో పాటుగా చైనా, హాంకాంగ్ ,సింగపూర్ లకు పెద్ద మొత్తంలో నిధులు మళ్ళీ చారనీ అధికారులు తేల్చారు. విదేశాలకు అక్రమంగా ఇసుక తరలింపు ప్రధాన సూత్రధారిగా బీకే గోయల్ ఉన్నారని ఈడీ పేర్కొంది.

Tags:    

Similar News