కేసీఆర్ కు నచ్చ చెప్పింది జగన్ సన్నిహితుడే

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపు ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసే జరిగిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గత ఆరు నెలల నుంచి ఏపీ [more]

Update: 2020-05-13 08:16 GMT

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపు ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసే జరిగిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గత ఆరు నెలల నుంచి ఏపీ ప్రభుత్వం ఇదే ప్రయత్నంలో ఉందన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో జగన్ తరుపున శ్రీకాంత్ రెడ్డి స్వయంగా వచ్చి నచ్చచెప్పారని, అందుకే కేసీఆర్ పోతిరెడ్డి ప్రాజెక్టు విషయంలో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్ లో దీక్ష చేస్తున్న నేతలకు ఉత్తమ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోతిరెడ్డి ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడంతో నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. కేసీఆర్ వైఫల్యం వల్లనే జగన్ ప్రాజెక్టు నిర్మాణానికి జీవో విడుదల చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పోతిరెడ్డిపాడు విస్తరణ జరిగితే కేసీఆర్ రాజీనామా చేయాలన్నారు. నీటి దోపిడీతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే మర్చిపోయారన్నారు.

Tags:    

Similar News