చంద్రబాబు అంతలా నవ్వడమా..?

Update: 2018-11-02 08:01 GMT

వై.ఎస్. జగన్ ను ఎవడో కత్తితో పొడిస్తే చంద్రబాబుకు అంత ఆనందం ఎందుకని, చంద్రబాబు జీవితంలో అంతలా నవ్వడం మొదటిసారి చూశానని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఒకవేళ సానుభూతి కోసం నిజంగానే జగనే పొడిపించుకుంటే అక్కడే పడిపోయి నానా హడావుడి జరిగాల్సి ఉండేదన్నారు. కానీ, అలా కాకుండా జగన్ సాధారణంగా ఫస్ట్ ఎయిడ్ చేసుకుని హైదరాబాద్ వెళ్లి ఆసుపత్రిలో చేరారని పేర్కొన్నారు. జగన్ అలా నడిచి వెళ్లిపోకుండా అక్కడే పడిపోయి ఉంటే టీడీపీ కార్యాలయాల మీద దాడులు జరిగేవని, కనీసం మూడురోజులు కర్ఫ్యూ ఉండే ప్రమాదం ఉండేదన్నారు.

జగన్ మేలు చేసినట్లే....

జగన్ అక్కడే ఉండకుండా రాష్ట్రానికి చాలా మేలు చేశారన్నారు. ఈ ఘటన వెనుక జగన్ పాత్ర గానీ, చంద్రబాబు పాత్ర గానీ ఉండే అవకాశం లేదన్నారు. వైఎస్ఆర్ కు నాటకాలు చేయడం ఇష్టం ఉండేది కాదని, బహుశా జగన్ ది కూడా అలాంటి గుణమే అయ్యి ఉంటుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ తో కలవడం వంటివన్నీ పక్కకు వెళ్లిపోయి కేవలం కత్తి ఎవరు ఇచ్చారు అనే అంశంపై ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు ఉన్నారని పేర్కొన్నారు. జగన్ కు జనం బాగా వస్తున్నారు, వెళ్లిన చోటల్లా సక్సెస్ అవుతున్నారని... ఈ పరిస్థితిలో సానుభూతి కోసం ఇటువంటి దాడులు చేయించుకోవాల్సిన అవసరం ఆయనకు లేనే లేదని పేర్కొన్నారు. దాడి వెనక ఎవరు ఉన్నారో నిందితుడికి నార్కో అనాలసిస్ టెస్టు చేస్తే సరిపోతుందన్నారు.

Similar News