శత్రువులు స్నేహితులయ్యారే...

Update: 2018-06-12 09:10 GMT

ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన ఉత్తర కొరియా దేశాధినేత కిమ్, అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. మంగళవారం సింగపూర్ వీరి సమావేశానికి వేదికైంది. సుమారు 2 గంటల పాటు సింగపూర్ లోని కేపెల్లా హోటల్లో పాటు ట్రంప్, కిమ్ లు చర్చలు జరిపారు. అణునిరాయుధీకరణ, శాంతి స్థాపనే లక్ష్యంగా వారి చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఇరువురు దేశాధినేతలు స్నేహంగా మాట్లాడుకున్నారు. కిమ్ ను వైట్ హౌజ్ కు ఆహ్వానించారు ట్రంప్. భేటీ అనంతరం ట్రంప్ మీడియా సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడారు. మార్పు సాధ్యమేనని తామిద్దరం నిరూపించామని ఆయన పేర్కొన్నారు. వీలైనంత త్వరలో అణునిరాయుధీకరణ జరుగుతుందని, క్షిపణ ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేస్తామని కిమ్ హామీ ఇచ్చారని తెలిపారు. నిన్నటి ఉద్రిక్తత రేపటి యుద్ధానికి దారి తీయకూడదని, యుద్ధం ఎవరైనా చేస్తారని, కానీ, సాహసం ఉన్న వారే శాంతి ప్రక్రియ చేపడతారని పేర్కొన్నారు. ఉభయ కొరియాల ప్రజలు సామరస్యంతో జీవించాలని ఆయన ఆశించారు.

Similar News