బ్రేకింగ్: టీడీపీపై టీఆర్ఎస్ ఫిర్యాదు..!

తెలుగుదేశం పార్టీపై టీఆర్ఎస్ ఐటీ వింగ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డేటా చోరీ వ్యవహారం తెరపైకి వచ్చాక టీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా [more]

Update: 2019-03-07 13:15 GMT

తెలుగుదేశం పార్టీపై టీఆర్ఎస్ ఐటీ వింగ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డేటా చోరీ వ్యవహారం తెరపైకి వచ్చాక టీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా దొంగ ట్వీట్లు చేయించారని ఆరోపించింది. టీడీపీ ఐటీ వింగ్ నుంచే ఈ తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆధారాలున్నాయని, ఫేక్ ట్వీట్లు పెడుతున్న వారిపై, పెట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేతలు కోరారు. డేటా చోరీ కేసు తెరపైకి వచ్చాక దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టారు. తెలుగు రాని వారు, తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేని వారు, డేటా చోరీ వ్యవహారం ఏంటో తెలియని వారు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లను విశ్లేషించిన టీఆర్ఎస్ ఐటీ వింగ్ డబ్బులిచ్చి దొంగ ట్వీట్లు చేయించారని గుర్తించి ఆధారాలతో సహా బయటపెట్టారు. ఈ ఆధారాలతోనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News