92 కోట్లు వసూలు చేశారా….??

సైబారాబాద్ కమిషనరేట్…ఈఏడాది పెద్ద పెద్ద కేసులు ఛేదించినా క్రైం రేట్ విషయంలో అంతగా టైం కలిసి రాలేదు. కిడ్నాప్ లు, రేప్ లు, హత్యలు, ఆన్ లైన్ [more]

Update: 2018-12-29 10:46 GMT

సైబారాబాద్ కమిషనరేట్…ఈఏడాది పెద్ద పెద్ద కేసులు ఛేదించినా క్రైం రేట్ విషయంలో అంతగా టైం కలిసి రాలేదు. కిడ్నాప్ లు, రేప్ లు, హత్యలు, ఆన్ లైన్ మోసాలు ఖాకీ బాసులను కాస్త కలవరానికి గురి చేశాయి. వాటిని నుండి ఎలా తేరుకోవాలా అని తలలు పట్టుకునే సమయంలో ట్రాఫిక్ చలాన్లు తలెత్తుకునేలా చేశాయి. ఈ ఏడాది వాహనదారుల ముక్కుపిండి వసులు చేసిన మొత్తం అక్షరాలా 92కోట్లు..మీరు వింటుంన్నది అక్షరాలా నిజం .సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులకు ఈ సారి మల్టిలెవెల్ మార్కెటింగ్ రూపంలో కాస్త కలిసి వచ్చింది. వేలాది మంది జనాలకు టోపీ పెట్టిన వ్యాపారులను భరతం పట్టిన పోలీసులు కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేశారు. మూడు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన కరక్కాయలాంటి కేసులను సైతం సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ ఏడాది కొన్ని విభాగాలలో కలిసి వచ్చిన మరికొన్ని డిపార్టుమెంట్ లో అంతగా కలిసి రాలేదు.

నేరాలు తగ్గి….

2017లో 18 మంది కరడు గట్టిన నేరస్థులపై పిడి యాక్ట్ నమోదు చేసిన పోలీసులు 2018లో 61 మంది పై కేసులు నమోదు చేశారు. అలాగే ఈ కమిషనరేట్ పరిధిలో 2017 లో 21,255 నేరాలు జరిగితే ఈ ఏడాది 16,811 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది సైబరాబాద్ లో కిడ్నాప్ కేసుల సంఖ్య బాగా పెరిగింది. గత ఏడాది 2017లో 201 కేసులు జరిగితే. ఈ ఏడాది 2018లో 333 కిడ్నాప్ కేసులు నమోదైనాయి. అంతే కాదు 2017లో 93 చైన్ స్నాచింగ్ జరిగితే ఈ ఏడాది 63 స్నాచింగ్ కేసులు నమోదు చేసి కాస్త తమ పర్సంటేజీని తగ్గించుకున్నారు.

రికార్డు బద్దలు…

ఇక పేకాట కేసులో 148 కేసులకు గాను 938 మంది అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 84.21 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. డెబిట్ అండ్ క్రెడిట్ మోసాలు కూడా 33శాతం, ఆన్ లైన్ మోసాలు 57శాతం పెరిగాయి. ఇక కేసులు అన్నింటి విషయాలను కాస్త పక్కన పెడితే 2018 లో స్పాట్ చలనా, ఈ చలనా, కోర్ట్ కేసులు కలిపి 91 కోట్ల 91 లక్షల 59వేల 500 వందల జరిమానా రూపంలో వసూలు చేసిన ఘనత సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకే దక్కింది. అంతే కాదు ఈ ఏడాది తాగి వాహనం నడిపిన 4,203 మంది ఊచలు లెక్కించే పరిస్థితికి తెచ్చారు. మొత్తానికి క్రైం రేట్, ఆన్ లైన్ మోసాలు, కిడ్నాప్ కేసులు అన్ని పెరిగినా చలనా వసూలులో సైబరాబాద్ కమిషనరేట్ మిగతా రెండు కమిషనరేట్ల కన్నా డబుల్, త్రిబుల్ రికార్డు బద్ధలు కొట్టింది.

Tags:    

Similar News