సినీ ప్రముఖులకు క్లీన్ చిట్

హైదరాబాద్ లో గతంలో పోలీసులకు పట్టుబడిన డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ లభించింది. డ్రగ్స్ కేసులో వారు నిందితులు కాదని, బాధితులని పోలీసులు ఛార్జిషీట్ [more]

Update: 2020-01-12 07:30 GMT

హైదరాబాద్ లో గతంలో పోలీసులకు పట్టుబడిన డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ లభించింది. డ్రగ్స్ కేసులో వారు నిందితులు కాదని, బాధితులని పోలీసులు ఛార్జిషీట్ లో పేర్కొనడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ లో డ్రగ్స్ కేసు గతంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో సినీ ప్రముఖులు పూరీ జగన్నాధ్, రవితేజ, చార్మి, ముమైత్ ఖాన్ వంటి వారి పేర్లు బయటకు వచ్చాయి. వారిని పోలీసులు విచారించారు కూడా. రక్తపరీక్షలు కూడా చేశారు. ఇది జరిగి మూడేళ్లు గడుస్తున్నా ఇంకా కేసు తేలలేదు. అయితే రైటు టు ఇన్ ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరగా డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు తేలింది.

Tags:    

Similar News