లాక్ డౌన్ లో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు

ఒక ప్రభుత్వ టీచర్ పేటిఎం అకౌంట్ నుండి 10 రూపాయల మొబైల్ రీచార్జ్ చేయడంతో క్షణంలో లక్ష రూపాయలు కొట్టేశారు.పేటిఎం ద్వారా కరెంట్ బిల్లు కడదమని చూసేసరికి [more]

Update: 2020-05-20 08:47 GMT

ఒక ప్రభుత్వ టీచర్ పేటిఎం అకౌంట్ నుండి 10 రూపాయల మొబైల్ రీచార్జ్ చేయడంతో క్షణంలో లక్ష రూపాయలు కొట్టేశారు.పేటిఎం ద్వారా కరెంట్ బిల్లు కడదమని చూసేసరికి తన అకౌంట్ నుండి లక్ష రూపాయలు డ్రా చేసినట్లుగా కనిపించడంతో వెంటనే టీచర్ ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మొబైల్ కు రావాల్సిన ఓటీపీ నెంబర్ కూడా రాలేదని అయినా కూడా తన అకౌంట్ నుండి లక్ష రూపాయలు మాయమయ్యాయి. అంతేకాకుండా లాక్‌డౌన్‌ సమయంలో విద్యుత్ ,నీటి బిల్లుల చెల్లింపు కోసం పేటీఎం యాప్ ను మొబైల్ లో వేయించు కున్నానని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పేటీఎం యాప్ ను మొబైల్ లో వేయించుకోవడం వల్ల లక్ష రూపాయలు డ్రా చేసుకున్నారని అవి ఇంటి లోన్ కోసం దాచి పెట్టుకున్న సొమ్ము అని బాధిత కుటుంబం లబోదిబో మంటున్నారు. ఇద్దరు బాధితులు ఎల్ బీ నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News