అందుకే ఎల్వీని బదిలీ చేశారు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని హిందూ అనుకూల నిర్ణయాలను తీసుకున్నందుకే బదిలీ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. తిరుపతి పర్యటనలో ఉన్న చంద్రబాబును హిందూ [more]

Update: 2019-11-08 07:01 GMT

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని హిందూ అనుకూల నిర్ణయాలను తీసుకున్నందుకే బదిలీ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. తిరుపతి పర్యటనలో ఉన్న చంద్రబాబును హిందూ సంఘాల ప్రతినిధులు కలిశారు. టీటీడీలో అన్యమతాలకు చెందిన వారు ఉద్యోగులుగా ఉన్నారని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని హిందూ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నందుకే బదిలీ చేశారన్నారు. టీటీడీలో హిందూయేతర ఉద్యోగులు ఉండటానికి వీల్లేదని చంద్రబాబు చెప్పారు. వారిని ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని చంద్రబాబు కోరారు.

Tags:    

Similar News