Trs : నేడు టీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళన

కేంద్ర ప్రభుత్వం వరిని కొనుగోలు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగనుంది. ప్రతి నియోజకవర్గం, మండల కేంద్రాల్లో ధర్నాలు చేయనుంది. కేంద్ర [more]

Update: 2021-11-12 03:45 GMT

కేంద్ర ప్రభుత్వం వరిని కొనుగోలు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగనుంది. ప్రతి నియోజకవర్గం, మండల కేంద్రాల్లో ధర్నాలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా తాము ఆందోళనలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టీఆర్ఎస్ నేతలు ధర్నాలకు దిగుతున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున జిల్లా కలెక్టర్ల అనుమతి తీసుకుని ఆందోళనలు చేయాలని టీఆర్ఎస్ నేతలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పిలుపునిచ్చారు. రెండు గంటల పాటు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ ధర్నాలు కొనసాగుతాయి.

Tags:    

Similar News