తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఆయనే..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు ఎమ్మెల్యేలతో [more]

Update: 2019-01-16 10:41 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇక, స్పీకర్ ఎంపికపై కసరత్తు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డిల పేర్లతో పాటు, గత అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన పద్మా దేవేందర్ రెడ్డి పేర్లను కూడా పరిశీలించారు. అయితే, పోచారం శ్రీనివాస్ రెడ్డి వైపు కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలిసింది. పొచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ కావడం ఖాయమే అంటున్నారు.

Tags:    

Similar News