సభ ఎవరి జాగీరూ కాదు

తెలంగాణ బడ్జెట్ పై అసెంబ్లీలో రసవత్తరమైన చర్చ సాగుతోంది. బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడారు. ఆరు నెలల కోసం ఓటాన్‌ [more]

Update: 2019-09-14 08:19 GMT

తెలంగాణ బడ్జెట్ పై అసెంబ్లీలో రసవత్తరమైన చర్చ సాగుతోంది. బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడారు. ఆరు నెలల కోసం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్రానిదేన్నారు. ప్రభుత్వం చెబుతున్న అంశాలు వాస్తవితకు దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. దివాళా తీసిన బడ్జెట్ లా ఉందని బట్టి ఆగ్రహం వ్యక్తంచేశారు. విక్రమార్క వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ వెంటనే స్పందించారు. భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, మాట్లాడే ధోరణిలో తప్పుగా మాట్లాడడమే కాకుండా సభను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు కేసీఆర్. బడ్జెట్ లో చూపించిన ప్రతి లెక్క కాగ్‌ చెప్పినవేనని, బడ్జెట్‌లో చూపించిన లెక్కలు వంద శాతం కరెక్టే నన్నారు. రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు మిగులు బడ్జెట్‌ ఉండే అనుడు పెద్ద జోక్‌ అంటూ కేసీఆర్ అనడంతో మిగితా సభ్యులు బల్లలు చరిచారు. విమర్శించొచ్చు కానీ లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు చెప్పడం సరికాదని, కాగ్‌ ధృవీకరించిన లెక్కలనే సభ ముందు ప్రవేశపెట్టామని కేసీఆర్ చెప్పారు.

దేశంలో నెంబర్ వన్……

వాస్తవిక దృక్పథంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని, రాష్ట్రాన్ని దివాళా తీయించలేదని కేసీఆర్ చెప్పారు. దేశంలో మనం నంబర్‌వన్‌గా ఉన్నాం. ఆర్థిక నిపుణులను సంప్రదించిన తర్వాతే బడ్జెట్‌ను రూపొందించామని, మాంద్యం ప్రభావంతో బడ్జెట్‌లో కోత పెట్టామని మేమే చెప్పాం. ప్రతి లెక్కనూ రేపు సభ ముందు పెడుతాం. సభలో ఏది పడితే అది మాట్లాడడం సరికాదు అని సీఎం కేసీఆర్‌ సూచించారు.

 

 

Tags:    

Similar News