టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ ఎందుకంటే?

మంత్రాలయం టిడిపి ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే తిక్కారెడ్డి ని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మిగనూరు లోని తిక్కారెడ్డి నివాసానికి హైదరాబాద్ పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. [more]

Update: 2019-10-22 02:56 GMT

మంత్రాలయం టిడిపి ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే తిక్కారెడ్డి ని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మిగనూరు లోని తిక్కారెడ్డి నివాసానికి హైదరాబాద్ పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు స్థానిక పోలీసుల సాయంతో వచ్చి తీసుకెళ్లారు. హైదరాబాద్ సమీపంలో శంషాబాద్ వద్ద తిక్కారెడ్డి భాగస్వామిగా ఏర్పాటు చేసిన మద్యం పరిశ్రమ కు తీసుకున్న వరి పొట్టు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వలేదని వారిపై ఓ వ్యక్తి పోలీసుల కు ఫిర్యాదు చేశారు. లక్ష టన్నుల వరి పొట్టు కు 12 కోట్లు బాకీ ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో తిక్కారెడ్డి ని 3వ ముద్దాయి గా చేర్చినట్లు చేర్చారు.

కోట్లు వసూలు చేసి…..

శంషాబాద్ పరిధిలోని ఒక రైస్ వ్యాపారికి రైస్ సప్లై చేస్తానని, చెప్పి డబ్బులు తీసుకోవడంతోపాటు కర్ణాటక పలు రాష్ట్రాల్లోని వ్యాపారులకు డబ్బులు ఎగవేసినట్లు ఫిర్యాదు రావడంతో తిక్కారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 16 కోట్ల రూపాయల మోసం కేసులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చిన తిక్కా రెడ్డిని వెంటనే పోలీసులు కోర్టులో హాజరు పరిచారు . కోర్టు ఈ మేరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

Tags:    

Similar News