ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి వచ్చే సీట్లిన్నే..!

Update: 2018-08-25 10:48 GMT

లోక్ సభ ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగలడం ఖాయం అంటోంది నేతా యాప్ సంస్థ. ఓటర్ల అభిప్రాయాలను యాప్ ద్వారా స్వీకరించే ఈ సందర్భంగా ఎనిమిది నెలల పాటు సుదీర్ఘ సర్వే నిర్వహించింది. గత మూడు నెలలుగా బీజేపీ తన ప్రాభవం కోల్పోతోందని, ఇప్పడే ఎన్నికలు జరిగితే బీజేపీ గత ఎన్నికల కంటే ఏకంగా 70 సీట్లు కోల్పోయి 212కి పరిమితం అవుతుందని ఆ సంస్థ అంచనా వేసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కొంత మెరుగవుతోందని, ఆ పార్టీ 110 స్థానాలు గెలిచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ కు ప్రస్తుతం కేవలం 44 సీట్లు మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే.

రెండు రాష్ట్రాల్లోనూ...

ఇక త్వరలో జరగబోయే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలోనూ బీజేపీ వెనుకంజలో, కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయని స్పష్టం చేసింది. రాజస్థాన్ ప్రస్తుత ముఖ్యమంత్రి వసుంధర రాజే(బీజేపీ) కంటే కాంగ్రెస్ ముఖ్య నేత అశోక్ గెహ్లాట్ కే ఎక్కువ ప్రజాధరణ ఉందని, అదే విధంగా మధ్య ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(బీజేపీ) కంటే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్య నేతగా ఉన్న జ్యోతిరాధిత్య సింధియాకే ఎక్కువ ప్రజల మద్దతు ఉందని ఆ సంస్థ అంచనా వేసింది.

Similar News