రామోజీరావుకు ఎదురుదెబ్బ

Update: 2018-10-12 07:40 GMT

ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి ఫైనార్షియర్స్ పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన స్టేను పొడిగించాలని దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ రూ.2300 కోట్ల డిపాజిట్లు సేకరించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై 2006లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ జరిగగా తదుపరి విచారణను నిలిపివేయాలని 2011లో మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, క్రిమినల్ ప్రొసీడింగ్స్ లో ఆరు నెలలకు మించి స్టే ఇవ్వకూడదని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో మార్గదర్శపై స్టే రద్దు కానుంది. దీంతో స్టేను పొడిగించాలని మార్గదర్శి సంస్థ సుప్రీం ను ఆశ్రయించగా స్టే పొడిగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించేందుకు మాత్రం అనుమతించింది.

Similar News