అసెంబ్లీ రద్దుపై హైకోర్టుకు వెళ్లాలి..!

Update: 2018-10-05 07:28 GMT

ప్రజలు ఐదేళ్లు పరిపాలించమని అధికారం ఇస్తే నాలుగున్నరేళ్లకే అసెంబ్లీని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైదరాబాద్ కు చెందిన కోమిరెడ్డి రాంచందర్ అనే వ్యక్తి ఈ పిటీషన్ దాఖలు చేయగా.. శుక్రవారం పిటీషన్ పరిశీలించిన జస్టిస్ ఏకే సిక్రీ ధర్మాసనం.. అసెంబ్లీ రద్దు ముందు హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టుకు రావడం సరికాదన్నారు. అసెంబ్లీ రద్దు, ఓటు జాబితాలో తప్పులు, ముందస్తు ఎన్నికలు వంటి అంశాలపై ఇప్పటికే సుప్రీంలో దాఖలైన అన్ని పిటీషన్లను హైకోర్టుకు బదలాయించామని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో అసెంబ్లీ రద్దు పంచాయతీ హైకోర్టుకు చేరింది.

Similar News