కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

Update: 2018-10-26 06:42 GMT

సీబీఐలో జరుగుతున్న పరిణామాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తనను అకారణంగా సెలవుపై పంపించారని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను విచారించిన కోర్టు... కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు నోటీసులు ఇచ్చింది. అలోక్ వర్మపై ఉన్న ఆరోపణలు సైతం రెండు వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇంఛార్జి సీబీఐ డైరెక్టర్ గా నియమితులైన ఎం.నాగేశ్వరరావు కేవలం పరిపాలనా వ్యవహారాలనే చూసుకోవాలి కానీ ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది.

Similar News