ఆ తీర్పు కోసం…?

దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. దశాబ్దాల నుంచి వివాదానికి నిలయమైన అయోధ్య అంశంపై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. అయోధ్య రామజన్మస్థలం ఎవరన్నదానిపై మరికాసేపట్లో స్పష్టత రానుంది. [more]

Update: 2019-11-09 01:35 GMT

దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. దశాబ్దాల నుంచి వివాదానికి నిలయమైన అయోధ్య అంశంపై నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. అయోధ్య రామజన్మస్థలం ఎవరన్నదానిపై మరికాసేపట్లో స్పష్టత రానుంది. ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్యపై తీర్పు చెప్పనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించనుంది. అయోధ్యపై తీర్పు వెలువడనున్న దృష్ట్యా దేశమంతా ఆసక్తితో చూస్తుంది. దేశ వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు తీర్పు వెలువడే అవకాశముంది. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపట్ల పోలీసులు ఇప్పటికే నిఘా ఉంచారు.

Tags:    

Similar News