అనూహ్యంగా వెనక్కు తగ్గిన కాంగ్రెస్

Update: 2018-05-08 07:54 GMT

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానంపై న్యాయస్థానంలో కాంగ్రెస్ వెనక్కు తగ్గింది. తామిచ్చిన అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించడాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ పార్టీ నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు కాంగ్రెస్ పిటీషన్ పై విచారణ జరుపుతామన్న చెప్పిన సుప్రీంకోర్టు, ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్నిఏర్పాటు చేసింది.కాని ఈరోజు విచారణ సందర్భంగా కపిల్ సిబల్ ధర్మాసనం ఏర్పాటు చేసింది ఎవరో చెప్పాలని కోరారు. అందుకు తిరస్కరించడంతో తన పిటీషన్ ను వెనక్కు తీసుకుంటున్నట్లు కపిల్ సిబల్ స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.

Similar News