ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు ముందుగు సాగడం లేదు.. రీజన్ ఇదే

ప్రజా ప్రతినిధులు కేసులను త్వరితగతిన విచారణ చేయాలనీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2018 డిసెంబర్ లో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు [more]

Update: 2021-03-02 01:44 GMT

ప్రజా ప్రతినిధులు కేసులను త్వరితగతిన విచారణ చేయాలనీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2018 డిసెంబర్ లో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయాలనీ జీవో జారీ చేసింది. సుప్రీం కోర్టi ఇచ్చిన ఆదేశాలతో ప్రజా ప్రతినిధుల కేసులు విచారణ వేగవంతం చేశాయి న్యాయ స్థానాలు. అయితే కోర్టు విచారణ చేస్తుంది కానీ లా అండ్ ఆర్డర్ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో పీపీలు లేక కేసుల విచారణ ముందుకు సాగడం లేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుండి న్యాయస్థానంలో సిబ్బంది లేకపోవడం తో కేసులు పరిష్కారం వైపు అడుగులు పడటం లేదు. 30 మంది సిబ్బంది పని చేయాల్సిన దగ్గర కేవలం 6 మాత్రమే ప్రత్యేక కోర్టు లో పని చేస్తున్నారని ,మిగిలిన సిబ్బందిని కేటాయించడం లో రాష్ట్రం ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపడం లేదని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రశ్నిస్తుంది.

64 మంది ఎమ్మెల్యేలు, పది మంది ఎంపీలు…

ఎన్నికలు సందర్బంగా ప్రజాప్రతినిధులు ఇచ్చిన అఫిడవిట్ లు ప్రకారం చుస్తే 64 మంది శాసన సభ్యులు,10 మంది పార్లమెంటు సభ్యులు పై మొత్తం 509 పైగానే కేసులు ఉన్నట్లు సమాచారం. నాలుగు కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేస్తున్న వ్యక్తే ప్రత్యేక కోర్ట్ కు విచారణకు హాజరు కావాల్సి వస్తుందని దీని వలన కేసులు త్వరితగతిన పూర్తి కాలేక పోతున్నాయి.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది మంది ఎంపీలు పై కేసులు ఉన్నట్లు తేలింది. పది మంది పార్లెమెంట్ సభ్యులు పై దాదాపు 133 కేసులు ఉన్నాయి. ఇక 64 మంది ఎమ్మెల్యేలు పై 346 కేసులు ఉన్నాయి.ఇక మాజీలు పై కూడా 30 కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. సుప్రీం కోర్ట్ ఆదేశాలతో జిల్లాల్లో ఉన్న కేసులుమొత్తం కూడా ప్రత్యేక న్యాయ స్థానానికి వెంటనే బదిలీ అవ్వాలి. కానీ ఇప్పటి వరకు 509 కేసులో కేవలం 245 కేసులు మాత్రమే స్పెషల్ కోర్ట్ కు బదిలీ అయినట్లు సమాచారం. మిగిలిన సగం కేసులు ప్రజాప్రతినిధులు ప్రత్యేక కోర్ట్ కి బదిలీ కాకపోవడం తో విచారణ కు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

ఒక్క కేసులో మాత్రమే….

2018 నుండి ఇప్పటి వరకు 73 కేసులను డిస్ పోస్ చేస్తే అందులో 50 కేసుల్లో నిర్దోషిగా , 19 కేసులను డిశ్చార్జ్ చేసి ,నాలుగుకేసులును బదిలీ చేసింది న్యాయస్థానం. ఇప్పటి వరకు కేవలం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు పై దురుసుగా ప్రవర్తించిన కేసులో మాత్రమే శిక్ష పడింది తప్ప ,మిగిలిన ఏ ఒక్క ప్రజా ప్రతినిధికి కూడా శిక్షలు ఖరారు కాలేదు .. ఎలక్షన్ కేసులు ఆలా వదిలేసినా రాజకీయ నాయకులపై నమోదైన క్రిమినల్ కేసుల్లో కూడా పోలీసులు సరైన ఆధారాలు కోర్టుకి ఇవ్వక పోవడం, సాక్షులను న్యాయస్థానం ముందు ఉంచలేక పోవడం తో కేసులు వీగిపోతున్నాయంటుంది ఫోరంఫోర్ గుడ్ గవర్నె..పోలీసులు నిర్లక్షమా లేక వారిపై ఏదైనా రాజకీయ ఒత్తిడి తో కేసులు లైట్ తీసుకుంటున్నారో తెలియదని అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా పోలీస్ శాఖ , ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేసే రెగ్యులర్ ప్రాసిక్యూటర్ ను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంది .. ప్రజా ప్రతినిధులు పై నమోదైన క్రిమినల్ కేసులు పై కూడా పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News