మీరొస్తే చాలు

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఒక్క అభ్యర్థి తన ప్రచారానికి 28లక్షలు ఖర్చు పెట్టాలి. కాని ప్రచారం ఈ కొద్దిడబ్బుతో జరుగుతుందా అంటే ఎవరైనా టక్కున చెప్పేస్తారు [more]

Update: 2019-10-17 10:42 GMT

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఒక్క అభ్యర్థి తన ప్రచారానికి 28లక్షలు ఖర్చు పెట్టాలి. కాని ప్రచారం ఈ కొద్దిడబ్బుతో జరుగుతుందా అంటే ఎవరైనా టక్కున చెప్పేస్తారు కాదని. ఒక ఎన్నిక జరగాలంటే కోట్ల రూపాయలు ఖర్చుపెడితేనే ప్రచారం, ఎన్నిక సాధ్యమవుతుంది. మరి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మరి అభ్యర్థులు ఎలా ఖర్చు పెడుతున్నారో తెలుసా……?

ఎన్నిక పండుగ…..

ఎన్నికలు వచ్చాయింటే చాలా మందికి పండగే. ఇప్పుడు హుజూర్ నగర్ లో ఉప ఎన్నిక రావడంతో కొందరు పండగ చేసుకుంటున్నారు. ఒక్క అభ్యర్థి వెంట ప్రచారానికి వెళితే ఉదయం నుంచి రాత్రి వరకు క్యాండెటే ఖర్చు పెట్టాలి. ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం బిర్యానీ, రాత్రికి మందు, విందు కూడా ఉంటాయి. లేకపోతే ప్రచారానికి ఎవరూ రారు. కార్యకర్తలు రావాలంటే ఈ మాత్రం ఖర్చు అభ్యర్థులు పెట్టాలి. మరో వైపు వాహనాలు, జెండాలు, కరపత్రాలు, సౌండ్ బాక్సులు, డప్పులు ఇలా ఈ ఖర్చులన్నీ కూడా సపరేటే.

మా ఇంటికి రండి…..

అభ్యర్థులు ఖర్చు చేసే దానిపై ఎన్నికల అధికారులు డేగ కన్నుపెట్టి చూస్తున్నారు. ఇంకో వైపు అభ్యర్థులు పెద్దమొత్తంలో ఖర్చుపెడుతున్నారని ఈసీకి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకుంటున్నారు. దీంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. చివరికి కొత్త ఎత్తుగడ వేశారు. గ్రామాల్లో ఎవరి బర్త్ డేలు, మ్యారేజ్ డేలు ఇతర శుభ కార్యాలున్నా ఈ అభ్యర్థులే దావత్ లు ఇస్తున్నారు. ఆ దావత్ కు అందరినీ పిలిచి ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తలు సైతం రోజు ఏదో ఒకరి పేరిట దావత్ లు పెడుతున్నారు. ఇలా అభ్యర్థులు ఎన్నికల ఖర్చు నుంచి తప్పించుకుంటున్నారు. మరి మీ ఇంట్లో ఏమైనా దావత్ ఉందా…..?

 

 

Tags:    

Similar News