ఆంక్షలు మరింత కఠినతరం

కరోనా కేసులు పెరుగుతుండటంతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. వైరస్ ప్రబలకుండా ఉండేందుకు లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. ఇప్పటివరకూ [more]

Update: 2021-05-16 01:16 GMT

కరోనా కేసులు పెరుగుతుండటంతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. వైరస్ ప్రబలకుండా ఉండేందుకు లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. ఇప్పటివరకూ దుకాణాలు 12 గంటల వరకూ తెరిచేందుకు అనుమతి ఉంది. అయితే ఈ సమయాన్ని పదిగంటల వరకూ కుదించారు. టీ దుకాణాలను పూర్తిగా మూసివేయాలని స్టాలిన్ ఆదేశించారు. ఈ కామర్స్ కంపెనీలకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం6 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఈపాస్ అనుమతి తప్పనిసరి చేశారు. ఆన్ లైన్ లో నిత్యావసర వస్తువుల సరఫరాకు కూడా ఉదయం పది గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. పెళ్లిళ్లకు హాజరుకావాలంటే జిల్లాల నుంచి కూడా ఈ రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేశారు. రానున్న 16, 23 తేదీల్లో సంపూర్ణ లాక్ డౌన్ అమలవుతుందని స్టాలిన్ ప్రకటించారు. కేసుల తీవ్రత తగ్గడానికే స్టాలిన్ ఈ నిర్ణయాలు తీసుకున్నారు

Tags:    

Similar News