పోలింగ్ లో ఉద్రిక్తత… పోలీసుల కాల్పులు

12 రాష్ట్రాల్లో 95 లోక్ సభ స్థానాలకు రెండో విడదల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 95 స్థానాలకు 1,644 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తమిళనాడులోని [more]

Update: 2019-04-18 07:00 GMT

12 రాష్ట్రాల్లో 95 లోక్ సభ స్థానాలకు రెండో విడదల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 95 స్థానాలకు 1,644 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తమిళనాడులోని 38 స్థానాలకు, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తరప్రదేశ్ లో 8, అస్సాంలో 5, బిహార్ లో 5, ఒడిశాలో 5, చత్తీస్ గఢ్ లో 3, పశ్చిమ బెంగాల్ లో 3, జమ్మూకశ్మీర్ లో 2, మణిపూర్ లో 1, పుదుచ్చెరిలో 1 స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ పెద్ద ఎత్తున నమోదవుతోంది. పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక్కడి రాయిగంజ్ ప్రాంతంలో పోలింగ్ బూత్ వద్ద ఓటర్లు, పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ప్రజలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. అయినా పరిస్థితి సద్దుమణగకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు.

Tags:    

Similar News