ఎంఐఎం ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు

ఎం.ఐ.ఎం ఎమ్మెల్యే బలాలా పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది . బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు శృతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాదర్ ఘాట్ పోలీస్ [more]

Update: 2020-05-24 01:54 GMT

ఎం.ఐ.ఎం ఎమ్మెల్యే బలాలా పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది . బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు శృతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగింది. బాలికను పరామర్శించేందుకు బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు శృతి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంలో ఎం.ఐ.ఎం ఎమ్మెల్యే బలాలా శృతి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బలాలా పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చాలా రోజుల వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో రెండు రోజుల క్రితం చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ ముందు బిజెపి కార్యకర్తలు ఆందోళన చేశారు. శృతి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు . చివరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే బలాల పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News