నువ్వు ఖాళీగా ఉన్నావు.. మాకయితే అంత తీరికలేదు

టీడీపీ అధినేత చంద్రబాబు ఉచిత సలహాలు ఊరికే ఇస్తారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు అఖిల పక్షం పెట్టమంటున్నారని, హైదరాద్ లో పెట్టాలా? [more]

Update: 2020-05-06 02:52 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు ఉచిత సలహాలు ఊరికే ఇస్తారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు అఖిల పక్షం పెట్టమంటున్నారని, హైదరాద్ లో పెట్టాలా? అని సజ్జల ఎద్దేవా చేశారు. ఐదేళ్ల కాలంలో ఎన్ని విపత్తులు వచ్చినా చంద్రబాబు ఒక్కసారైనా అఖిలపక్ష సమావేశం పెట్టారా? అని సజ్జల నిలదీశారు. ఖాళీగా కూర్చున్న చంద్రబాబుకు సమావేశాలు కోరుతున్నారని, తమకు అంతటి తీరిక లేదని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాల్సిన బాధ్యత వైసీపీ పై ఉందన్నారు. పుక్కింటి పురాణాలు వినేందుకు తాము సిద్ధంగా లేమని చెప్పారు. తమ ఎమ్మెల్యేలందరూ ప్రజాసేవలో మమైకమై ఉన్నారని, ఇప్పుడు నీ సలహాలు ఎవరికీ అవసరం లేదని కూడా సజ్జల మండి పడ్డారు.

Tags:    

Similar News