బాబుకు బండలు వేయడం తప్ప ఇంకోటి చేతకాదు

ఏపీలో ప్రతిపక్షం బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సమయంలోనూ ప్రభుత్వాన్ని టీడీపీ అప్రదిష్ట పాలు చేయడానికే ప్రయత్నిస్తుందని తెలిపారు. ఎన్నికలకు [more]

Update: 2020-04-03 08:57 GMT

ఏపీలో ప్రతిపక్షం బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సమయంలోనూ ప్రభుత్వాన్ని టీడీపీ అప్రదిష్ట పాలు చేయడానికే ప్రయత్నిస్తుందని తెలిపారు. ఎన్నికలకు ముందు ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయిన చంద్రబాబు ఇప్పుడు ఆదాయం పెరిగిందని చెప్పడంలో అర్థమేంటని ఆయన ప్రశ్నించారు. నలభై వేల కోట్ల బిల్లులను పెండింగ్ లో పెట్టి చంద్రబాబు దిగిపోయారన్నారు. బయట నుంచి అప్పుల పుట్టని పరిస్థితిని కూడా చంద్రబాబు చేశారన్నారు. తమ ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలను వాయిదా పద్ధతిలో చెల్లించడానికి ముందుకు వస్తే దానికి వీరి అభ్యంతరం ఏంటని సజ్జల ప్రశ్నించారు. ప్రభుత్వంపై బండలు వేయడమే పనిగా పెట్టుకున్నారు. తాము చెల్లించింది రెండు వేల కోట్లు ఫీజు రీఎంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీకి పదిహేను వందల కోట్లు చెల్లించామని చెప్పారు. చంద్రబాబు లాగా కాంట్రాక్టర్లకు తాము చెల్లించలేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News