ఈ నరకం ఇంకెన్నాళ్లు….?

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె కొనసాగుతుండడంతో ప్రయాణికుల కష్టాలు అంతే స్థాయిలో ఉన్నాయి. సమ్మె చేపట్టి ఏడు రోజులు కావడంతో అన్ని డిపోల్లోని బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. [more]

Update: 2019-10-11 08:22 GMT

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె కొనసాగుతుండడంతో ప్రయాణికుల కష్టాలు అంతే స్థాయిలో ఉన్నాయి. సమ్మె చేపట్టి ఏడు రోజులు కావడంతో అన్ని డిపోల్లోని బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం కొన్నిఅద్దెబస్సులు, తాత్కాలిక కండక్టర్, డ్రైవర్లతో నడిపిస్తున్నబస్సులు ప్రయాణికులకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో జనం నరకయాతన అనుభవిస్తున్నారు. నిత్యం వేలాది బస్సులు నడిచే సమయంలో వందల చొప్పున బస్సులు నడుస్తుండడంతో అవి ఏమాత్రం ప్రయాణికులకు సరిపోవడం లేదు.

పెరిగిన డిమాండ్….

మరోవైపు ఆర్టీసీ సమ్మెతో ప్రైవేటు వామనాలకు డిమాండ్ పెరిగింది. ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్ ల డ్రైవర్లు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. పదిరూపాయలు ఉన్న ఛార్జీలను 30 రూపాయలు, 50 రూపాయలు చేశారు. ఇష్టముంటే రండి లేకపోతే లేదంటూ బెదిరిస్తున్నారు. ఇంకోవైపు నడుస్తున్న ఆర్టీసీ బస్సుల్లో పాసులు నడవవని చెబుతున్నారు. ఆటో డ్రైవర్లయితే మీటర్లతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా ధరలు చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో వెళ్లాల్సిన జనం ఎంతంటే అంత చెల్లించకతప్పడం లేదు.

సర్కార్ మాటేమిటి?

ఏడురోజులుగా జనం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మాత్రం అంతగా స్పందించడం లేదు. ప్రత్యామ్నాయంగా బస్సులు నడిపిస్తున్నామని చెప్పినా అవి ప్రజలకు ఏ మేరకు సరిపోతున్నాయనే విషయంపై దృష్టి సారించడం లేదు. ఇంకోవైపు ఈ తాత్కాలిక బస్సుల్లోనూ ఛార్జీలు అదనంగా వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం, అటు ఆర్టీసీ కార్మికుల మొండి వైఖరిల మధ్య ప్రయాణికులకు శాపంగా మారింది.

 

 

Tags:    

Similar News