సమ్మె కొనసాగించాలనే

ఆర్టీసీ సమ్మెను కొనసాగించాలని జేఏసీ నిర్ణయించినట్లు తెలిసింది. ఈరోజు ఉదయం నుంచి కార్మికులతో సమావేశమైన ఆర్టీసీ సంఘాలు వారి అభిప్రాయాలను తీసుకున్నాయి. ఎక్కువమంది సమ్మెను కొనసాగించాలని నిర్ణయించారు. [more]

Update: 2019-11-19 13:35 GMT

ఆర్టీసీ సమ్మెను కొనసాగించాలని జేఏసీ నిర్ణయించినట్లు తెలిసింది. ఈరోజు ఉదయం నుంచి కార్మికులతో సమావేశమైన ఆర్టీసీ సంఘాలు వారి అభిప్రాయాలను తీసుకున్నాయి. ఎక్కువమంది సమ్మెను కొనసాగించాలని నిర్ణయించారు. సమ్మెను అర్థాంతరంగా విరమిస్తే ఆత్మహత్యలు చేసుకున్న కార్మికుల ఆత్మలు ఘోషిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఒక్క డిమాండ్ కూడా తీరకుండా సమ్మెను విరమించడంలో అర్థం లేదని చెప్పారు. ఆర్టీసీ జోనల్ జేఏసీ నేతలతో సమావేశమయిన తర్వాత ఆర్టీసీ జేఏసీనేతలు సమావేశమయ్యారు. రేపు సమ్మె యధాతధంగా జరుగుతుందని తెలిపారు. అలాగే బుధవారం రాజకీయ పార్టీలతో జేఏసీ నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని జేఏసీ నిర్ణయించింది. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాాత న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతనే తుదినిర్ణయం ప్రకటిస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News