బస్సులన్నీ రోడ్డు మీదకు.. ఇక షురూ

దాదాపు రెండు నెలలుగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు తెలంగాణలో రోడ్డు మీదకు వచ్చాయి. లాక్ డౌన్ నిబంధనలను సడలించడంతో ఈరోజు ఉదయం నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సులు [more]

Update: 2020-05-19 03:53 GMT

దాదాపు రెండు నెలలుగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు తెలంగాణలో రోడ్డు మీదకు వచ్చాయి. లాక్ డౌన్ నిబంధనలను సడలించడంతో ఈరోజు ఉదయం నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. హైదరాబాద్ ను మినహాయించి అన్ని జిల్లాలకు బస్సులు తిప్పుతున్నారు. రాత్రి 7గంటల వరకూ మాత్రమే బస్సులు నడుస్తాయి. బస్సుల్లో భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు తమ స్వస్థలాలకు చేరుకునే అవకాశం దొరికినట్లయింది. సీటీ బస్సులకు హైదరాబాద్ లో అనుమతించలేదు. అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా బస్సు సర్వీసులను నడపడం లేదు. బస్సులన్నింటినీ ప్రతిరోజూ శానిటైజ్ చేయాలని ప్రభుత్వం ఆర్టీసీని ఆదేశించింది.

Tags:    

Similar News