Rk roja : పుష్ప కోసం సంబరాలు చేసుకున్న రోజా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా పుష్ప విషయంలో ఆనందంగా ఉన్నారు. ఆమె సంబరాలు చేసుకున్నారు. గత ఏడాది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన [more]

Update: 2021-11-04 01:51 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా పుష్ప విషయంలో ఆనందంగా ఉన్నారు. ఆమె సంబరాలు చేసుకున్నారు. గత ఏడాది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా రోజా పుష‌్ప అనే అనాధ బాలికను దత్తత తీసుకున్నారు. ఆమెను చదివిస్తున్నారు. అయితే ఈ ఏడాది జరిటిన నీ‌ట్ పరీక్షల్లో పుష్పకు 89 శాతం మార్కులు రావడంతో రోజా తబ్బిబ్బవుతున్నారు.

పుట్టిన రోజు కానుకగా…

తాను జగనన్న పుట్టిన రోజు నాడు చేసిన మంచి పని సత్ఫలితాలనిస్తుందని రోజా అభిప్రాయపడ్డారు. పుష్ప చదువు ఖర్చును రోజాయే భరిస్తున్నారు. తనకు పుట్టిన రోజు కానుకగా పుష్ప ఈ కానుకను అందించిందని రోజా తెగ మురిసిపోయారు. పుష్పతో కలసి కుటుంబం సభ్యులందరూ కలసి ఫొటోలు దిగారు.

Tags:    

Similar News