ఓటుకు నోటే ప్రధానమా?

Update: 2018-10-03 06:16 GMT

ఆదాయపు పన్ను శాఖ అధికారుల పిలుపు మేరకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇటీవల రెండు రోజుల పాటు రేవంత్ ఇంట్లో సోదాలు జరిపిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు ఇచ్చి నేడు విచారణకు హాజరు కావాలని చెప్పారు. ఈరోజు రేవంత్ తో పాటు సెబాస్టియన్, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల రెడ్డి, ఉదయసింహలను విచారించనున్నారు. ఓటుకు నోటు కేసులో యాభై లక్షల నగదు ఎక్కడి నుంచి తెచ్చారన్న దానిపైనే ఐటీ శాఖ అధికారులు వీరిని ప్రశ్నించనున్నట్లు తెలిసింది. ఈ విచారణలో రేవంత్ ను ప్రశ్నించేందుకు ప్రత్యేకంగా ఒకప్రశ్నావళిని ముగ్గురు అధికారులతో కూడిన బృందం రూపొందించినట్లు తెలుస్తోంది.

ఐటీ శాఖ కార్యాలయం ఎదుట.....

రేవంత్ ఇంటి నుండి స్వాధీనం చేసుకున్న పత్రాలను గత రెండు రోజులుగా విశ్లేసిస్తున్న ఐటీ అదికారులు రేవంత్ పై ప్రశ్నల వర్షం కురిపించనున్నరాు. రేవంత్ రాక నేపథ్యంలో ఆయకార్ భవన్ కు రేవంత్ అభిమానులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలు చేరుకుంటున్నారు. రేవంత్ తో పాటు సెబాస్టియన్, ఉదయ సింహ రేవంత్ సోదరుడు కొండలరెడ్డి నేడు హాజరయ్యారు వీరితో పాటు సాయి మౌర్య ఎస్టేట్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థకు చెందిన నలుగురు డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి, సురేష్ రెడ్డి శివరామిరెడ్డి, రామచంద్రారెడ్డి సైతం ఐటి అధికారుల ముందు హాజయ్యారు.

Similar News