రాయపాటిపై ఈడీ కేసు

మాజీ ఎంపీ రాయపాటిపై ఈడీ కేసు నమోదు చేసింది. రాయపాటి సాంబశివరావు 3,822 కోట్లు దారి మళ్లించినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కనుగొన్నారు. రాయపాటి [more]

Update: 2020-01-03 03:58 GMT

మాజీ ఎంపీ రాయపాటిపై ఈడీ కేసు నమోదు చేసింది. రాయపాటి సాంబశివరావు 3,822 కోట్లు దారి మళ్లించినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కనుగొన్నారు. రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ పదహారు కోట్ల నిధులను మలేషియా, సింగపూర్ లకు తరలించినట్లు ఈడీ విచారణలో కనగొనింది. రాయపాటి సాంబశివరావుపై ఈడీ నిధుల మళ్లింపు కేసు నమోదు చేసింది. ఇప్పటికే ట్రాన్ ట్రాయ్ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. కొన్ని కోట్ల రూపాయల నిధులను దారిమళ్లించినట్లు సీబీఐ తమ దాడుల ద్వారా కనుగొనింది. ఫెమా చట్టం కింద రాయపాటి, ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై కేసు నమోదు చేసింది. రాయపాటి సాంబశివరావుతో పాటు ఆయన కుమారుడు రామారావుపై కూడా కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News