కేంద్రం తలుపుతట్టిన రమణ దీక్షితులు..?

Update: 2018-05-22 08:12 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం, రమణ దీక్షితుల నడుమ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వివాదంపై రమణ దీక్షితులు కేంద్రం తలుపుతట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన నిన్న ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి శ్రీవారి అభరణాల మాయంపై ఫిర్యాదు చేశారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను కూడా రమణ దీక్షితులు కలిశారు. ఈ మేరకు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఆ ఫోటోలు ఇప్పటివేనా, పాతవేనా అనేది తేలాల్సి ఉంది. టీటీడీలో ఆభరణాల మాయంపై ఆయన ఇప్పటికే సీబీఐ విచారణ కోరుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటి ప్రభుత్వాలకు సంబంధం లేదు...

అయితే, అభరణాల మాయం ఇప్పటి ప్రభుత్వాలకు సంబంధం లేదని 2011లో శ్రీవారి అభరణాలను తనిఖీ చేసిన పురావస్తు శాఖ మాజీ అధికారి చెన్నారెడ్డి తెలిపారు. తాము తనిఖీ జరిపే నాటికే శ్రీకృష్ణదేవరాయలు శాసనాల ప్రకారం అనేక ఆభరణలు కనపడలేదని, అనేక ఏళ్ల క్రితం నుంచి ఇవి లేవని ఆయన అన్నారు. టీటీడీ ఆలయం పురావస్తు శాఖ కిందకు తీసుకువస్తే వచ్చే ఇబ్బంది ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.

Similar News