తమిళనాట రజనీకాంత్ పార్టీ గుర్తు హల్ చల్

రజనీకాంత్ పార్టీ ప్రకటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. ఆయన తన పార్టీ గుర్తుగా సైకిల్ ను ఎంచుకోవాలని యోచిస్తున్నారు. ఈ మేరకు తమిళనాడులో సైకిల్ తో [more]

Update: 2020-12-12 06:04 GMT

రజనీకాంత్ పార్టీ ప్రకటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. ఆయన తన పార్టీ గుర్తుగా సైకిల్ ను ఎంచుకోవాలని యోచిస్తున్నారు. ఈ మేరకు తమిళనాడులో సైకిల్ తో కూడిన రజనీకాంత్ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. రజనీకాంత్ అన్నామలై చిత్రంలో సైకిల్ పై పాలక్యాన్ తో వెళుతున్న ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పార్టీ గుర్తును సైకిల్ గా ఎంచుకోవాలని భావిస్తున్నారు. సైకిల్ గుర్తుపై ఇప్పటికే సన్నిహితులతో రజనీకాంత్ చర్చించినట్లు తెలిసింది. తొలుత బాబా సినిమాలో వేలితో చూపించిన గుర్తును తీసుకోవాలనుకున్నారు. కానీ ఆ గుర్తు ఎన్నికల కమిషన్ వద్ద లేకపోవడంతో రజనీకాంత్ సైకిల్ గుర్తు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News