జగన్ బెయిల్ పిటీషన్ రద్దు పై రఘురామ వాదన ఇదే

జగన్ బెయిల్ రద్దు పై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జగన్ [more]

Update: 2021-06-14 06:33 GMT

జగన్ బెయిల్ రద్దు పై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జగన్ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. జగన్ కౌంటర్ పై వాదనలు వినిపించేందుకు రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది . ఈ మేరకు రఘురామకృష్ణంరాజు తరుపున న్యాయవాదులు జగన్ కౌంటర్ పై ప్రతి కౌంటర్ ను దాఖలు చేశారు. దీంట్లో పలు అంశాలను ప్రస్తావించారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ అనేది పిటిషన్ అర్హత సాధించిన తరువాతనే కోర్టు విచారణ కు స్వీకరించిందని పేర్కొన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో చాలా అధికారులు సాక్షులుగా , నిందితులు ఉన్నారని తెలిపారు. ఇప్పుడు వారంతా జగన్ ప్రభుత్వం లో కీలక స్థాయిలో ఉన్నారని, దీంతో అధికారుల ను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జగన్ ప్రభావితం చేస్తున్నారని రఘురామ కృష‌్ణంరాజు తరుపున న్యాయవాదులు వాదించారు. ఐఏఎస్ ,ఐపీఎస్ అధికారుల బదిలీలు , నియామకాలు చీఫ్ సెక్రెటరీ చూడాల్సి ఉంటుందని, కానీ ఏపీ లో ఒక కొత్త జీవో తీసుకొచ్చి ఐఏఎస్ , ఐపీఎస్ లను సీఎం స్వయంగా నియమించేలా జీవో తెచ్చారని వారు కౌంటర్ లో పేర్కొన్నారు. దీంతో అక్కడ అధికారులను ఎదో రకంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని వారు చెప్పారు. రాజకీయంగా లబ్ది పొందడానికి తాను పిటీషన్ వేయలేదని, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై 11 ఛార్జిషీట్లు ఉన్నాయని రఘురామకృష్ణంరాజు తరుపున న్యాయవాదులు పేర్కొన్నారు. సాక్షులను ప్రభావితం కాకుండా ఆచూడాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారులు పై ఉందని పేర్కొన్నారు.

Tags:    

Similar News