భారత్ కు పెరుగుతున్న మద్దతు… ఒంటరవుతున్న పాక్

పుల్వామా ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయంగా పాకిస్థాన్ ఒంటరవుతోంది. ఈ ఘటన తర్వాత పలు దేశాలు భారత్ సంఘీభావం ప్రకటించాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పుల్వామా [more]

Update: 2019-02-20 06:45 GMT

పుల్వామా ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయంగా పాకిస్థాన్ ఒంటరవుతోంది. ఈ ఘటన తర్వాత పలు దేశాలు భారత్ సంఘీభావం ప్రకటించాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పుల్వామా ఉగ్రదాడిని ఖండించారు. ఈ దాడిని భయానక చర్యగా అభివర్ణించిన ఆయన సైనికులపై దాడిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, పూర్తి స్థాయి నివేదిక వచ్చాక ఈ ఘటనపై స్పందిస్తామని పేర్కొన్నారు. మరో వైపు పుల్వామా దాడిని ఖండిస్తూ న్యూజిల్యాండ్ అసెంబ్లీలో తీర్మాణం చేశారు. ఇక పాకిస్థాన్ లో తల దాచుకుంటున్న అజర్ మహమ్మద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గర్తించి నిషేదం విధించాలని ఫ్రాన్స్ తీర్మానం చేసి ఐక్య రాజ్యసమితికి పంపింది. ఈ డిమాండ్ ను భారత్ చాలా రోజులుగా చేస్తోంది.

Tags:    

Similar News