ప్రొటెం స్పీకర్ పైనే …?

సుప్రీంకోర్గు తీర్పుతో మహారాష్ట్రలో నెంబర్ గేమ్ మొదలయింది. అయితే ప్రొటెం స్పీకర్ ను నియమించాలని గవర్నర్ ను సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఎవరిని నియమిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ప్రొటెం [more]

Update: 2019-11-26 05:50 GMT

సుప్రీంకోర్గు తీర్పుతో మహారాష్ట్రలో నెంబర్ గేమ్ మొదలయింది. అయితే ప్రొటెం స్పీకర్ ను నియమించాలని గవర్నర్ ను సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఎవరిని నియమిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ప్రొటెం స్పీకర్ కేవలం ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే రేపు మహారాష్ట్ర శాసనసభలో ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలోనే బలపరీక్ష నిర్వహించడం కొత్త సంప్రదాయంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్ అయితే న్యాయం జరుగుతుందా? అనే చర్చ జరుగుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

శాసనసభ పక్ష నేతగా…..

ప్రొటెం స్పీకర్ శాసనసభ పక్షనేతగా అజిత్ పవార్ ను గుర్తిస్తే పరిస్థితి ఏంటన్నది శివసేన కూటమిలో భయం బయలుదేరింది. ఇప్పటికే ఎన్సీపీ అజిత్ పవార్ ను శాసనసభ పక్ష నేతగా తొలగించిన సందర్భంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తి కరంగా మారింది. ఎన్సీపీ తమ శాసనసభ పక్షనేతగా జయంత్ పాటిల్ ను నియమించినా ఆయనను ప్రొటెం స్పీకర్ గుర్తిస్తారా? లేదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అజిత్ పవార్ మాత్రం తానే ఎన్సీపీ శాసనసభ పక్షనేత అని ఇప్పటికే క్లెయిమ్ చేసుకున్నారు. ఆయన విప్ జారీ చేస్తే ఎన్సీపీ ఎమ్మెల్యేలు విప్ ను థిక్కరిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News